పిఎంఇండియా

ప్ర‌ధాన మంత్రి స‌చివాల‌యాన్ని 1947వ సంవ‌త్స‌రం ఆగ‌స్టు నెల 15వ తేదీ నాడు ఏర్పాటు చేయ‌డ‌మైంది. త‌రువాత అంటే 1977వ సంవ‌త్స‌రం మార్చి నెల 28వ తేదీ నాటి నుండి, దీని పేరు ను ప్ర‌ధాన మంత్రి యొక్క కార్యాల‌యం (పిఎం ఒ) గా మార్చ‌డ‌మైంది.

వ్యాపార నిబంధనల కేటాయింపు, 1961 కింద ప్రధాన మంత్రి కార్యాలయం (పి ఎమ్ ఒ) ప్రధాన మంత్రికి సెక్రటేరియల్ అసిస్టెన్స్ ను అందిస్తుంది.

పి ఎమ్ ఒ కు అధిపతిగా ప్రధాన మంత్రి యొక్క ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు. ప్రస్తుతం పి ఎమ్ ఒ లో (ప్రధాన మంత్రి వ్యక్తిగత సిబ్బంది /సహాయ మంత్రి, జాతీయ భద్రత సలహాదారు/పూర్వ ప్రధాన మంత్రులు మినహా) 122 మంది గెజిటెడ్, 281 మంది నాన్- గెజిటెడ్ ఉద్యోగాలు ఉన్నాయి. పి ఎమ్ ఒ ముఖ్య కార్యాలయం సౌత్ బ్లాక్ లో ఉంది. అయితే, కొన్ని విభాగాలు మాత్రం రైల్ భవన్ లో (ఆర్ టి ఐ విభాగం) మరియు పార్లమెంట్ హౌస్ లో (పార్లమెంట్ విభాగం) ఉన్నాయి. ఇది రేస్ కోర్సు రోడ్డు లోని ప్రధాన మంత్రి నివాసం నుండి కూడా పని చేస్తుంది.

దీని అధికారాలు మరియు ఉద్యోగుల అధికారాలు, విధులు

పర్యవేక్షణ, జవాబుదారుతనంతో సహా నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియలో అనుసరిస్తున్న విధానం

పి ఎమ్ ఒ ప్రధాన మంత్రికి సెక్రటేరియల్ అసిస్టెన్స్ ను అందిస్తుంది. వాటిలో సహాయపడడం, అందిన ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు అవసరాల మేరకు తోడ్పాటు వంటివి ఉంటాయి.
ఆఫీస్ ప్రొసీజర్ యొక్క మేన్యువల్లో పొందుపరచిన ఆదేశాలను అనుసరించడం జరుగుతుంది.
ప్ర‌ధాన మంత్రి కి దాఖలు చేయవ‌ల‌సిన ఫైళ్ళ లో పేర్కొన‌వ‌ల‌సిన అంశం అనేది మంత్రిత్వ శాఖ కు ఆయ‌న నేరు గా బాధ్య‌త వ‌హిస్తున్నారా లేక ఎవ‌రైనా ఒక కేబినెట్ మంత్రి ఉన్నారా లేక ఆ మంత్రిత్వ శాఖ కుఎవ‌రైనా స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర బాధ్య‌త‌) ప‌ర్య‌వేక్ష‌ణ వ‌హిస్తున్నారా అన్న దాని పైన ఆధార‌ప‌డివుంటుంది. చివ‌ర‌న పేర్కొన్న సంద‌ర్భ‌మే అయితే గ‌నుక, చాలా వ‌ర‌కు అంశాల‌ను కేబినెట్ మంత్రి/బాధ్య‌త‌ వ‌హించే స‌హాయ మంత్రి ప‌రిష్క‌రిస్తారు. బాధ్య‌త వ‌హిస్తున్న మంత్రి గా ప్ర‌ధాన మంత్రి ఉన్న‌ప్పుడు, అటువంటి సంద‌ర్భాల లో ఆయా అంశాల‌కు మంత్రిత్వ శాఖ ఆమోదం అవ‌స‌ర‌మ‌యితే దానికి సంబంధించిన అధికారం ఆయా స‌హాయ మంత్రి/డిప్యూటీ మినిస్ట‌ర్ కు ద‌త్తం చేసి ఉండ‌ని ప‌క్షం లో, ఆ కేసు లను ప్ర‌ధాన మంత్రి ఆదేశాల‌ను కోరుతూ దాఖ‌లు చేయడం జ‌రుగుతుంది.

విధానపరంగా ముఖ్య‌మైన అంశాలు, 1961వ సంవ‌త్స‌రం నాటి భార‌త ప్ర‌భుత్వ (ఎలకేశన్ ఆఫ్ బిజినెస్‌) రూల్స్ మరియు 1961వ సంవ‌త్స‌రం నాటి భార‌త ప్ర‌భుత్వ (ట్రాన్సాక్ష‌న్ ఆఫ్ బిజినెస్‌) రూల్స్ ఇంకా వివిధ ఇత‌ర నియ‌మాల‌కు అనుగుణం గా ఆదేశాలు లేదా స‌మాచారం కోసం ప్ర‌ధాన మంత్రి కి దాఖలు చేయ‌వ‌ల‌సి ఉంటుంది.

విధులను నెరవేర్చడం కోసం అది రూపొందించిన నిబంధనలు.

మంత్రివ‌ర్గానికి అధినేత గా ప్ర‌ధాన మంత్రి మంత్రివ‌ర్గ స‌మావేశాల‌కు అధ్య‌క్ష‌త వ‌హిస్తారు; అలాగే భార‌త‌దేశ రాజ్యాంగం, 1961వ సంవ‌త్స‌రం నాటి భార‌త ప్ర‌భుత్వ (ఎలకేశన్ ఆఫ్ బిజినెస్‌) రూల్స్ మరియు 1961వ సంవ‌త్స‌రం నాటి భార‌త ప్ర‌భుత్వ (ట్రాన్సాక్ష‌న్ ఆఫ్ బిజినెస్‌) రూల్స్ లో ఉల్లేఖించిన ప్రకారం మంత్రివ‌ర్గం యొక్క విధుల‌ను నిర్వ‌ర్తిస్తారు.

విధులను నిర్వర్తించడం కోసం దీనికి నిర్దేశించిన, లేదా దీని నియంత్రణలో ఉన్న, లేదా దీని ఉద్యోగులు అనుసరించే నియమ నిబంధనలు, ఆదేశాలు, మేన్యువల్స్ మరియు రికార్డ్స్

PM India

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు / అఖిల భారత సర్వీసులో ఉన్న అధికారులు మరియు కేంద్ర ప్రభుత్వ అధికారులకు వర్తించే నియమాలు, నిబంధనలే దీని విధుల నిర్వహణకు కూడా వర్తిస్తాయి. ఒక సచిత్ర జాబితా కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి [ 419KB ]

దీని వద్ద ఉన్న, లేదా దీని అధీనంలో ఉన్న పత్రాల కేటగిరీల ప్రకటన

ప్రధాన మంత్రి కార్యాలయపు పరిపాలన, ప్రజా ఫిర్యాదులు, పిఎమ్ఎన్ఆర్ఎఫ్ వంటి వాటితో పాటు ప్రధాన మంత్రి కోరిన సమాచారం/ వ్యాఖ్యలు/ ఆదేశాలకు సంబంధించి ఇతర మంత్రిత్వ శాఖ/విభాగం/ మంత్రివర్గ సచివాలయం, రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇతర సంస్థల నుండి అందే అంశాలు.

దీనికి సంబంధించిన ఏదైనా ఒక విధానాన్ని రూపొందించడానికి గాని, లేదా ఆ తరువాత అమలుపరచడానికి గాని సంబంధించి – ప్రజలకు సభ్యత్వం ఉన్న, లేదా ప్రాతినిధ్యం ఉన్న ఎటువంటి ఏర్పాటుకు సంబంధించి అయినా సరే వివరాలు

విధానాలను ప్రజలలో భాగమైన సభ్యులను సంప్రదించి ఆయా మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు రూపొందించి, అమలుపరుస్తాయి. కాబట్టి, ఏదైనా ప్రతిస్పందన/ సూచనలు /ఫిర్యాదులను ప్రధాన మంత్రికి / పి ఎమ్ ఒ కు

దీనిలో భాగంగా గాని, లేదా దీని సలహా కోసం గాని ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ మంది వ్యక్తులతో కూడిన బోర్డులు, కౌన్సిల్ లు, కమిటీలు, ఇతర సంస్థల సమావేశాలు లేదా అటువంటి సమావేశాల తీర్మానాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా

అధికారులు మరియు ఉద్యోగుల సూచిక

ఉద్యోగుల సూచిక ను త‌రువాతి కాల‌మ్ లో, అంటే కాల‌మ్ (x) లో ఇవ్వ‌డం జ‌రిగింది. వారు అందుకొనే నెల‌వారీ పారితోషికం వివ‌రాలు ఇందులోవుంటాయి.

దీని నిబంధ‌న‌లలో పేర్కొన్న ప్ర‌కారం న‌ష్ట‌ప‌రిహార వ్య‌వ‌స్థ తో పాటు ప్రతి ఒక్క అధికారి, ఉద్యోగి అందుకునే నెల‌వారీ పారితోషికం

సమ‌యానుకూలంగా సవ‌ర‌ణ‌కు గుర‌య్యే ‘‘మంత్రుల జీతాలు- భ‌త్యాల చ‌ట్టం, 1952’’లో నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌ధాన మంత్రి/ ఎమ్ ఒ ఎస్ ( పి ఎమ్ ఒ) జీతాలు, ఇత‌ర అల‌వెన్సులు ఇవ్వబడ్డాయి.

దీని యొక్క ప్రతి ఏజెన్సీకి కేటాయించిన బ‌డ్జెటు. ఇందులోనే అన్ని ప్లాన్ ల, ప్ర‌తిపాదిత వ్య‌యాలు, చెల్లింపుల‌ నివేదిక‌ల ప్ర‌స్తావన ఉంటుంది.

ప‌రిపాల‌న నియంత్ర‌ణ కింద పి ఎమ్ ఒ నుండి బ‌డ్జెటు కేటాయించిన ఏజెన్సీ అంటూ లేదు.

PM India

(viii) Details of Expenditure for the F.Y.2019-20, Budget Estimates & Revised Estimates for the F.Y.2020-21 and Budget Estimates for the F.Y.2021-22 [ 313KB ]

స‌బ్సిడీ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ తీరు. ఇందుకోసం కేటాయించిన మొత్తాల‌తోపాటు అటవంటి కార్య‌క్ర‌మాల ల‌బ్ధిదారుల వివ‌రాలు.

పి ఎమ్ ఒ లో స‌బ్సిడీ కార్య‌క్ర‌మాలు అంటూ ఏవీ లేవు.

మిన‌హాయింపులు, ఇది ఇచ్చిన అనుమతిపత్రాలు లేదా అధికార పత్రాలు అందుకున్న వారి వివ‌రాలు .

దీని అందుబాటులో ఉన్న లేదా దీని ఆధీనంలో ఉన్న స‌మాచారానికి సంబంధించిన వివ‌రాలు; ఎల‌క్ట్రానిక్ రూపంలోకి మార్చిన స‌మాచారం.

పి ఎమ్ ఒ వెబ్ సైటులో అందుబాటులో ఉన్న ప్రకారం.

స‌మాచారాన్ని పొందడానికిగాను పౌరుల‌కు అందుబాటులోవున్న సౌక‌ర్యాల వివ‌రాలు. ప్ర‌జ‌ల‌కోసం నిర్వ‌హిస్తూ ఉంటే, లైబ్ర‌రీ లేదా రీడింగ్ రూమ్ ప‌ని గంట‌లు

ఏదయినా ఫీడ్ బ్యాక్ / స‌లహాలు / ఫిర్యాదులు ప్ర‌ధాన మంత్రి/ ప‌్ర‌ధాన మంత్రి కార్యాల‌యానికి తపాలా ద్వారా గానీ, “ఇంట‌రాక్టివ్ విత్ హోనరబుల్ పిఎం”
ద్వారా గానీ పంపవచ్చు.

పౌరులు వారి ఫిర్యాదుల‌ను ప‌లు విధాలుగా ప్ర‌ధానికి పంప‌వ‌చ్చు. తపాలా ద్వారా పంపే వారు ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం, సౌత్ బ్లాక్‌, న్యూఢిల్లీ, పిన్ – 110011కు పంప‌వ‌చ్చు. చేత్తో ఇవ్వాల‌నుకునే వారు పి ఎమ్ ఒ డాక్ కౌంట‌ర్ ద‌గ్గ‌ర ఇవ్వొచ్చు. ఫ్యాక్స్ ద్వారా 011-23016857కు పంప‌వ‌చ్చు.

ప్ర‌ధాన మంత్రికి పంపిన ఉత్త‌రాలు ఏ స్థాయిలో వున్నాయో తెలుసుకోవ‌డానికి ప్ర‌జ‌లు టెలిఫోను చేసి తెలుసుకోవ‌చ్చు. ఇందుకోసం వారు 011-23386447కు ఫోన్ చేసి త‌మ ఉత్త‌రాలు / ఫిర్యాదులు ఏ ద‌శ‌లో ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు.

ఆన్ లైన్ లో త‌మ ఫిర్యాదుల‌ను న‌మోదు చేయాల‌నుకునే వారు పిఎంఒ వెబ్ సైటు పిఎంఒ వెబ్ సైటు లోని లింకును ఉప‌యోగించుకోవ‌చ్చు.
‘వ్రయ్ట్ టు ది ప్రైమ్ మినిస్టర్’ .(‘ప్ర‌ధాన మంత్రికి రాయండి’),అనే శీర్షిక కింద ఫిర్యాదుల‌ను రాయ‌వ‌చ్చు. అది క్లిక్ చేసిన త‌రువాత సిపిజిఆర్ ఎఎమ్ఎస్ పేజి అందుబాటులోకి వ‌స్తుంది. ఇందులో ఫిర్యాదుల‌ను రిజిస్ట‌ర్ చేయ‌వ‌చ్చు. రిజిస్ట్రేష‌న్ పూర్త‌యిన త‌రువాత ప్ర‌త్యేక‌మైన రిజిస్ట్రేష‌న్ నంబ‌రును అక్క‌డ చూడ‌వ‌చ్చు. ప్ర‌జ‌లు త‌మ ఫిర్యాదులు లేదా స‌ల‌హాలు, సూచ‌న‌ల‌కు సంబంధించి అవ‌సర‌మైన డాక్యుమెంట్ల‌ను అప్ లోడ్ చేసుకోవ‌చ్చు. ఫిర్యాదులు ఏ స్థాయిలో వున్నాయో తెలుసుకోవ‌డానికిప్ర‌త్యేక‌మైన రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర‌ను ఉప‌యోగించి ఆ పేజి లింకులోకి వెళ్లాలి.

ప‌బ్లిక్ ఇన్ ఫర్మేష‌న్ ఆఫీస‌ర్ ల పేర్లు, ప‌ద‌వులు

పిఎంఓ కి సంబంధించి సిపిసి యొక్క సెక్షన్ 80 కింద నోటీసులు అందుకోవడానికి మరియు నిర్ణయం తీసుకోవడానికి నియమితులైన నోడల్ అధికారి పేరు, హోదా మరియు చిరునామా

శ్రీ చిరగ్ ఎం పంచల్, అండర్ సెక్రెటరీ, పిఎంఓ కి సంబంధించి సిపిసి యొక్క సెక్షన్ 80 కింద నోటీసులు అందుకోవడానికి మరియు నిర్ణయం తీసుకోవడానికి నియమితులైన నోడల్ అధికారి మరియు ఆయన చిరునామా: గది సంఖ్య. 236-బి, సౌత్ బ్లాక్, న్యూ ఢిల్లీ.

అధికారికంగా పేర్కొన్న అలాంటి ఇత‌ర స‌మాచారం

డి ఒ పి టి మార్గ‌ద‌ర్శ‌కాలు– 1.1

సేకరణకు సంబంధించిన సమాచారం. ప్ర‌భుత్వ అధికారులు జరిపిన సేకరణల వివ‌రాలు. ఇందులో నోటీసు ప్ర‌చుర‌ణ‌/ టెండ‌ర్ విచారణలు, బిడ్ ఎవ‌రికి ఇచ్చార‌నే వివ‌రాలు ఉంటాయి. అంతే కాదు, ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు, లేదా అంత‌కు మించి విలువ గల సేక‌రణ‌లు ఉంటే వాటి తాలూకా స‌ర‌ఫ‌రాదారుల పేర్లు ఇందులో ఉంటాయి.

పిఎంఒలో అన్ని సేక‌ర‌ణ ల‌ను వ్య‌య విభాగం పేర్కొన్న‌టువంటి సాధార‌ణ ఆర్థిక నియ‌మావ‌ళి మ‌రియు మార్గ‌ద‌ర్శ‌క సూత్రాల‌ కు అనుగుణంగా చేప‌డుతారు.

డిఓపిటి మార్గ‌ద‌ర్శ‌కాలు – 1.2

ప్ర‌భుత్వ ప్రైవేటు భాగ‌స్వామ్యం : ప్ర‌జ‌ల‌కు అందించే సేవ‌ల‌ను ప్ర‌భుత్వ ప్రైవేటు భాగ‌స్వామ్యం ద్వారా అందించాల‌ని ప్ర‌తిపాదించిన‌ప్పుడు పి పి పి ల‌కు సంబంధించిన వివ‌రాలు అంటే కాంట్రాక్టు/ రాయితీల‌కు సంబంధించిన ఒప్పందాలు. స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహిక‌ల్ (ఎస్పివి) ఒపంద వివ‌రాలు.

డిఓపిటి మార్గ‌ద‌ర్శ‌కాలు – 1.3

బ‌దిలీ విధానం, బ‌దిలీ ఆదేశాలు

పి ఎమ్ ఒ లోని అధికారుల‌ను/ సిబ్బందిని డి ఒ పి టి/ ఎమ్ హెచ్ ఎ / ఎమ్ ఇ ఎ లు నియ‌మిస్తాయి. ఉద్యోగుల సూచికలో వీరి వివ‌రాల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా అప్ డేట్ చేయ‌డం జ‌రుగుతుంది.

డి ఒ పి టి మార్గ‌ద‌ర్శ‌కాలు – 1.4

ఆర్ టి ఐ ద‌ర‌ఖాస్తులు/ మొద‌టి అప్పీళ్లు, వాటికి సంబంధించిన తిరుగు స‌మాధానాలు

డిఒపిటి మార్గ‌ద‌ర్శ‌కాలు – 1.5

సి ఎ జి & పిఎసి పేరాల‌తో పాటు చ‌ర్యల‌కు సంబంధించిన నివేదిక‌లు

పిఎమ్ఒ కు సంబంధించిన సిఎజి & పిఎసి పేరాలు లేవు.

డిఒపిటి మార్గ‌ద‌ర్శ‌కాలు – 1.6

ఇది పిఎమ్ఒకు వ‌ర్తించ‌దు.. ఎందుకంటే పిఎమ్ఒ ప్ర‌త్య‌క్షంగా పౌర సంబంధిత సేవ‌ల‌ను అందించ‌దు.

డిఒపిటి మార్గ‌ద‌ర్శ‌కాలు – 1.7

విచ‌క్ష‌ణ‌, విచ‌క్ష‌ణేత‌ర నిధులు. రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు/ స‌్వ‌చ్ఛంద సంస్థ‌లు/ ఇంకా ఇత‌ర‌ సంస్థ‌ల‌కు మంత్రిత్వ/ విభాగాలు అందించే అన్ని ర‌కాల విచ‌క్ష‌ణ‌, విచ‌క్ష‌ణేత‌ర నిధులు.

డిఒపిటి మార్గ‌ద‌ర్శ‌కాలు -1.8

ప్ర‌ధాన మంత్రి, జె ఎస్, అంత‌కంటే ఎక్కువ స్థాయి అధికారులు చేసే ప‌ర్య‌ట‌న‌లు

గౌర‌వ‌నీయులైన ప్ర‌ధాన మంత్రి 26.5.2014 నుండి చేప‌ట్టిన విదేశీ ప్ర‌యాణాల వివ‌రాలు. ఇందులోనే ఛార్ట‌ర్డ్ విమానాల‌ కోసం పెట్టిన ఖ‌ర్చులు కూడా ఉంటాయి

డిమాండ్ నం. 47--> కింద ప్రధాని యొక్క విమానాల – ఇతర ఛార్జీలు నిర్వహణకు దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ యొక్క గ్రాంట్ల కోసం వివరణాత్మక డిమాండ్.

PM India

పూర్వ ప్ర‌ధాన మంత్రి (డాక్ట‌ర్ మ‌న్ మోహ‌న్ సింగ్) చేప‌ట్టిన విదేశీ ప్ర‌యాణాల వివ‌రాలు. [ 1434KB ] ఇందులోనే ఛార్ట‌ర్డ్ విమానాల‌ కోసం పెట్టిన ఖ‌ర్చులు కూడా ఉంటాయి.

PM India

పూర్వ ప్ర‌ధాన మంత్రి (శ్రీ అట‌ల్ బిహారీ వాజ్ పేయి) చేప‌ట్టిన విదేశీ ప్ర‌యాణాల వివ‌రాలు. [ 493KB ] ) ఇందులోనే ఛార్ట‌ర్డ్ విమానాల‌ కోసం పెట్టిన ఖ‌ర్చులు కూడా వుంటాయి/

ప్ర‌ధాన మంత్రి దేశీయ ప‌ర్య‌ట‌న‌లు : ప‌్ర‌ధన మంత్రి జరిపే దేశీయ ప‌ర్య‌ట‌న‌ల ఖ‌ర్చుల‌ను ర‌క్ష‌ణ‌ మంత్రిత్వ శాఖ బ‌డ్జెటు నుండి ఖ‌ర్చు చేస్తారు. 26.5.2016 నుండి ప్ర‌ధాన మంత్రి జరిపిన దేశీయ ప‌ర్య‌ట‌న‌ల జాబితాను ప‌ర్య‌ట‌న కాల వ్య‌వ‌ధితో స‌హా పిఎమ్ఒ వెబ్ సైట్ లో ల‌భ్య‌మ‌వుతాయి.